పద్యాలు

  కీ.శే.తలతోటి సత్యానందం గారిపై  డా.తలతోటి పృథ్వి రాజ్ రచించిన పద్యాలు
 
ఆ. నీవులేని యిల్లు నిరయంబుగా దోచె
    నీదు తోడులేని నాదు బ్రతుకు
    అంధకార మయ్యే ననుదినంబును, గాన
    పుత్రరూపదీప్తి పొందిరమ్ము! 


 
తే. నీవుపెట్టిన  భిక్షయే నేర్పు చదువు
    నేను  పొందెడి సౌఖ్యమ్ము  నీదు శ్రమయె
    తీర్చుకొనలేని ఋణమును తీర్చుకొనక
    నన్ను  విడచియునేగితి నాకమునకు!

 
 
తే. తాను చేసిన బొమ్మను తానె చిదుపు
    మరణమను పేర దైవమ్ము మనసులేక
    నాకు  జన్మమ్మునిచ్చిన నాన్న!...నీవె
    అసలు  సిసలైన బ్రహ్మ నా ఆయువునకు 
(డా. తలతోటి పృథ్వి రాజ్  రచించి-ప్రచురించిన "నీలాకాశం" అనే  హైకూ సంపుటిలోని పద్యాలు )